జీవన శైలి

ఈ వీడియోలలో మన జీవన శైలి ఎట్లా మారుతోంది, మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తే ఆరోగ్యకరమైన జీవితము గడుపగలము అనే విషయాలు తెలిపే ప్రయత్నము చేశాను. ఈ విషయాల గురించి ఎంత చదివితే అంత తెలిసిన విషయం ఏమిటంటే, మన శరీరము గురించి, అది పని చేసే విధానాల గురించి, వివిధ పరిస్థితులలో అది దానిని అదే ఎలా అనువుగా మార్చుకుంటుంది, అనే వాటి గురించి మనకు చాల తక్కువ తెలుసు.

మన శరీరము గురించి ఎంతో తెలుసుకోవాల్సి వుంది, అది తన చుట్టూ ఉన్న పరిసరాలకు ఎలా అలవాటు పడుతుంది, దానిలో ఉన్న చిన్న చిన్న మెకనీసమ్స్ గురించి చాల పరిశోధన ఇంకా జరగ వలసి వుంది.
మన మధ్యలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి చాలా సులువుగా ఎలా అన్నారు – ‘ఆహారమే శరీరము’ . మనము తినే ఆహారమే మన శరీరము లో భాగముగా మారుతోంది, మన శరీరము ఒక గొప్ప యంత్రము, ఐతే దీనిని ఎలా వాడుకోవాలో మనకు ఇన్ స్ట్రుక్షన్స్ పుస్తకము లేనందున, మన శరీరాన్ని మన ఇష్టం వచ్చి నట్లు దుర్వినియోగము చేస్తున్నాము. ఈ విషయాల గురించి సరిఅయిన అవగాహనా తెలపడానికి, ఈ ప్రయత్నం.
ఈ వీడియోలలో విషయాలు నా సవంత రీసెర్చ్ ద్వారా నేను నేర్చుకున్న విషయాలు, వీటి పట్ల వేరు వేరు అభిప్రాయాలూ వుందా వచ్చు, నేను కేవలం ప్రేక్షకుల మనసులకు వారి అభిప్రాయాలకు వదిలివేస్తున్నాను, వీటిలో మంచోఐ ఉంటె గ్రహించండి, లేదా మీకు మేరె వీటిని గురించి చదివి అవగాహనా పెంచు కొని తదనుగుణంగా నడచుకోండి.